విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్ (వీడియో)

72చూసినవారు
పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటివారికి సరైన రీతిలో చెప్పి మార్చాల్సింది పోయి తీవ్రంగా కొట్టాడో టీచర్. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ స్కూల్లో గత నెలలో జరిగింది. విద్యార్థి తప్పు చేశాడని అతని వద్దకు వెళ్లిన టీచర్ జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చి గోడకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన CCTV వీడియో వైరలవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి స్కూల్ కు నోటీసులిచ్చారు. వివరణ ఇవ్వాలని, ఆ టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్