ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెథిక్ ఉల్లా అటల్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒమర్జాయ్ 67 మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇబ్రహీం జద్రాన్ 22, షాహిది 20, రషీద్ ఖాన్ 19 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ద్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్ 2, జంపా 2, మాక్స్‌వెల్, ఎల్లిస్ తలో వికెట్ తీసుకున్నారు. ఆసీస్ లక్ష్యం 274.