టీమిండియా ఫ్లాప్ షో.. రోహిత్ చెప్పిన కారణం ఇదే

70చూసినవారు
టీమిండియా ఫ్లాప్ షో.. రోహిత్ చెప్పిన కారణం ఇదే
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమిని తాము అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యామని అన్నాడు. 'ఈ రిజల్ట్ మేం ఊహించినది కాదు. వాళ్లు మనకంటే బాగా ఆడారు. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను స్వీకరించడంలో మేము విఫలమయ్యాము‘ అని రోహిత్ తెలిపాడు. మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయామనేది వాస్తవమని చెప్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్