LICకి దేశంలో అతిపెద్ద కస్టమర్ తెలంగాణ ప్రభుత్వం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. తెలంగాణ భవన్ లో BDL కార్మిక సంఘ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు భీమా పథకం కోసం ఎల్ఐసీకి ప్రతి సంవత్సరం రూ. 1,450 కోట్లను ఆనాడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినా, కేసీఆర్ ఎల్ఐసీకే ఇద్దాం అని చెప్పారు. అనేక ప్రభుత్వ రంగ కంపెనీలను కేసీఆర్ కాపాడారు' అని తెలిపారు.