తెలంగాణలో CMRF పథకంలో రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం దాదాపు రూ.830 కోట్లు ప్రభుత్వం CMRF విడుదల చేసింది. ఐదేళ్ళలో(2018-2023) అప్పటి ప్రభుత్వం CMRF ద్వారా రూ.2400 కోట్లు మాత్రమే సాయం అందించిందని CMO తెలిపింది. అంటే సగటున ఏడాదికి రూ.480 కోట్లు ఖర్చు పెడితే, CM రేవంత్ ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్లు సాయం అందించారు. ఇప్పటికే రూ.590 కోట్లు CMRFద్వారా సాయం అందించటం గమనార్హం.