తెలంగాణ తల్లి అంటే ఒక భావన కాదని.. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై ప్రకటన విడుదల చేసి మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించి సకలజనులు ఒక్కటే అని గర్జించిన ఉద్వేగం కనిపిస్తుందన్నారు. పోరాట యోదులు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఎంతో హుందాగా విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు.