తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను: BRS

73చూసినవారు
తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను: BRS
తెలంగాణకు హోం మంత్రే కాదు విద్యాశాఖ మంత్రి కూడా లేరని ట్విట్టర్‌లో బీఆర్ఎస్ సెటైరికల్ ప్రకటన జారీ చేసింది. 'కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 200 రోజులు అవుతున్నా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ విద్యాలయాల అవసరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు. అందుకే వెంటనే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను' అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్