పోలీస్‌స్టేషన్‌పై ఇండియన్‌ ఆర్మీ దాడి

83చూసినవారు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌తో పాటు ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ సైనికుడి ఇంట్లో మంగళవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన సైనికాధికారులు తమ సిబ్బందితో కలిసి అదేరోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గలాటా సృష్టించారు. ఈ ఘటనలో 16 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్