రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని CM రేవంత్ ఆకాంక్షించారు. కేరళలోని తిరువనంతపురంలో అదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో CM పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని.. అది 4 కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమని వెల్లడించారు. తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.