తెలంగాణ రాజముద్ర ఫైనల్?

52చూసినవారు
తెలంగాణ రాజముద్ర ఫైనల్?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర ఇదే అంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో భారత జాతీయ చిహ్నం (సింహాలు, అశోక చక్రం), అమరవీరుల స్తూపం, వరి విత్తనాలు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. కొత్త లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులు ఉన్నాయి. అయితే ఈ గుర్తును ప్రభుత్వం అధికారంగా ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్