భద్రాద్రి తరహాలో అమెరికాలో ఆలయ నిర్మాణం

61చూసినవారు
భద్రాద్రి తరహాలో అమెరికాలో ఆలయ నిర్మాణం
భద్రాద్రి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. తోటి అర్చకులతో భద్రాద్రి ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్