పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)'-2024 చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం నేరం చేసినట్లు రుజువైతే ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా ఉంటుంది. ఈ చట్టం UPSC, SSC గ్రూప్-సీ, బీ (నాన్ టెక్నికల్) వంటి పోటీ పరీక్షలకు, RRB నిర్వహించే గ్రూప్-సీ స్టాఫ్, గ్రూప్-డీ స్టాఫ్ వంటి తదితర పరీక్షలకు, NTA, IBPS పరీక్షలకు వర్తిస్తుంది.