అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

81చూసినవారు
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో అప్పుల బాధతో బుధవారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు చేసుకున్నాడు. కొమ్మాలకు చెందిన గడ్డమీది అశోక్‌ (43) రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని ఐదేళ్లుగా సాగుచేస్తున్నాడు. ఆశించిన దిగుబడులు రాక, రూ.6 లక్షల వరకూ అప్పులు కావడంతో మనస్థాపం చెంద వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కాగా అశోక్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్