తెలంగాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హాత్నూర గ్రామ శివారులో మహిళను దుండగులు పెట్రోల్ పోసి హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.