వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. అటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వడగండ్ల వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో మొదలైన వాన గంటసేపు కురిసింది. మునిపల్లి, ఝరాసంగం మండలాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఈదురు గాలులతో వడగళ్ళ వాన పడింది. దీంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి.