TG: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

77చూసినవారు
TG: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో అక్కడక్కడా 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయంది.

సంబంధిత పోస్ట్