తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, జనగామ, గద్వాల్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.