TGSRTC వెయ్యి కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉచిత బస్సు పథకంతో పెరిగిన రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు. సగటున రోజుకు 95-115 వరకు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదవుతోంది. దీనికి అనుగుణంగా బస్సులు నడపడం సిబ్బందికి కూడా ఇబ్బందిగా మారింది. కాలం చెల్లిన బస్సులు పెద్దసంఖ్యలో ఉన్నాయి. దీంతో వీలైనంత తొందరగా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వెయ్యి బస్సుల కొనుగోలుకు రూ.350-400 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా.