ఆ పాత్ర అంటే ఎంఎస్‌కి ఎంతో ఇష్టమట

548చూసినవారు
ఆ పాత్ర అంటే ఎంఎస్‌కి ఎంతో ఇష్టమట
ఎన్నో పాత్రలు వేసినా నటుడిగా ఎంఎస్‌ నారాయణకి దర్శకుడు బి.గోపాల్‌ రూపొందించిన 'రవన్న' చిత్రంలోని సర్పంచ్‌ పాత్ర ఎంతో ఇష్టమట. 'రామసక్కనోడు' సినిమాలో ఆటో డ్రైవర్‌ పాత్ర కూడా నచ్చిన పాత్రగా ఆయన చెప్పుకున్నారు. మూలశంకతో బాధపడుతున్న పాత్ర అది. ముఖంలో ఆ బాధను వ్యక్తం చేయాల్సిందిగా దర్శకుడు సూచనతో ఆ పాత్ర రక్తి కట్టిందని తెలిపారు. 'సర్దుకుపోదాం రండి' చిత్రంలోని జగపతి బాబు మామ పాత్ర తనకు నచ్చిందని ఆయన చెప్పొకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్