రామ్ చరణ్,
ఉపాసన దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించింది. చిన్నారికి క్లీంకార అనే పేరు పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో పిల్లలు పుట్టడం ఆలస్యం కావడానికి గల కారణాన్ని
ఉపాసన తెలిపారు. 'అమ్మ కావడాన్ని నేను డబుల్ గ్రేట్ అనుకుంటా. పిల్లలు పుట్టడం లేట్ కావడంతో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే వార్తలు నా వరకూ వచ్చాయి. పిల్లల్ని కనడానికి పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాతే కానాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకే ఇంత సమయం పట్టింది' అని తెలిపారు.