అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్‌ ఫాజిల్‌

71చూసినవారు
అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్‌ ఫాజిల్‌
మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ఇటీవల ‘ఆవేశం’ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. తానెందుకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘‘ఇంటర్వ్యూలు ఇవ్వడం స్వతహాగా నాకు ఇష్టం ఉండదు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. అందుకే వాటికి దూరంగా ఉంటాను తప్ప మరే ఉద్దేశం లేదు. నా సినిమాలే మాట్లాడాలని భావిస్తా. ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు ఇంటర్వ్యూల కంటే సినిమాలే నాకు సులువైన మార్గం’’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్