నిందితులను నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయాలి: రాజాసింగ్

82చూసినవారు
నిందితులను నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయాలి: రాజాసింగ్
TG: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేసిన NIA పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దుండగులను అప్పుడు పట్టుకోకపోతే వారు మరిన్ని దారుణాలకు పాల్పడేవారని అన్నారు. నిందితులకు ఉరిశిక్ష కాకుండా నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయాలని NIA కోర్టుని కోరారు.

సంబంధిత పోస్ట్