టీఎంసీ నాయకురాలి కారుపై దాడి (వీడియో)

52చూసినవారు
ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మిటాలి బాగ్ కారుపై ఆదివారం దాడి జరిగింది. అయితే దీనిని బీజేపీ కార్యకర్తలు చేశారని ఆమె ఆరోపించారు. తన కారుపై ఎమ్మెల్యే సుశాంత ఘోష్ మద్దతుతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో ఆమె కారు ముందు, వెనుక అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్