ముంబైలోని గోరై బీచ్ లో ఓ వ్యక్తి మృతదేహం 7 ముక్కలుగా లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి సీలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని కుళ్లిపోయిన మృతదేహం భాగాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించారు. కానీ, మృతదేహాం ఎవరిది అనేది ఇంకా గుర్తించలేదని, కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.