ముఖ్యమంత్రి సోదరుడి ఓటు గల్లంతు

73చూసినవారు
ముఖ్యమంత్రి సోదరుడి ఓటు గల్లంతు
పార్లమెంట్ ఎన్నికల ఐదో విడత పోలింగ్ వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ ఓటు గల్లంతైంది. ఆయనకు హౌరా ప్రాంతంలో ఓటు హక్కు ఉంది. ఇవాళ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అతని ఓటు గల్లంతైనట్లుగా తెలిసింది. ఓటు గల్లంతుపై ఆయనను మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. దీనిపై ఈసీ వివరణ ఇస్తుందని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది.

సంబంధిత పోస్ట్