న్యూజిలాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే తండ్రి కాబోతున్నాడు. అతని భార్య కిమ్ ఈ వారంలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో కాన్వే ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. కిమ్ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆమె పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న కివీస్ బ్యాటర్.. ఈ విషయాన్ని బోర్డుకు ముందే తెలియజేశారు. దీంతో, న్యూజిలాండ్ బోర్డు కాన్వే స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను చివరి టెస్టుకు ఎంపిక చేసింది.