వినియోగదారుల వివరాలను విచ్చలవిడిగా సేకరిస్తున్న వివిధ యాప్‌లు, వెబ్‌సైట్లు- వాటిని సక్రమంగా భద్రపరచడంలో చేతులెత్తేస్తున్నాయి. వ్యక్తిగత సమాచార సంరక్షణకు డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023 చట్టం మైలురాయి. సైబర్‌నేరాలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో డేటాకు సరైన రక్షణ లేకపోతే కష్టం. ఎక్కడకు వెళ్లినా పేరు, ఫోన్ నంబరు తదితర వివరాలు అడుగుతున్నారు. ఇలా సేకరించినవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షణ కల్పిస్తుంది.