తెలంగాణ ఇమేజ్‌ను పెంచడం కోసమే ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. "తెలంగాణ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లడం కోసం, ప్రపంచంలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసమే ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ నిర్ణయం తీసుకున్నాం. ఏదో ఆశించి గూడుపుఠాణితో చేసిన పనికాదు." అని కేటీఆర్ పేర్కొన్నారు.