న్యూజిలాండ్‌లో భారీ విమాన ప్రమాదం తప్పింది. సోమవారం క్వీన్స్‌టౌన్ నుండి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు బయలుదేరిన వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ 737-800 విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షిని ఢీకొనడంతో మంటలు వచ్చి ఇంజిన్ ఆగిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా న్యూజిలాండ్‌లోని విమానాశ్రయంలో దించారు. ఆ సమయంలో విమానంలో 73 మంది ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదదు.