భార్యకు క్షమాపణలు చెప్పిన హై జంపర్‌

59చూసినవారు
భార్యకు క్షమాపణలు చెప్పిన హై జంపర్‌
ఇటలీకి చెందిన స్టార్ హై జంప్‌ అథ్లెట్ జియాన్‌మార్కో తంబేరి తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అతడు తన వెడ్డింగ్‌ రింగ్‌ను సెన్ రివర్‌లో పోగొట్టుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ‘‘ఆ రింగ్‌ మిస్‌ అయినప్పటికీ ఇబ్బందేం లేదు. పారిస్‌ నుంచి అంతకంటే విలువైన గోల్డ్‌తో ఇంటికి వస్తా’’అని తన భార్య చైరా బోంటేమిని ఉద్దేశించి జియాన్‌మార్కో పోస్టు పెట్టాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్