ఎండ తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

66చూసినవారు
ఎండ తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలి. ప్రయాణాల్లో తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. సన్నటి, వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు ధరించటం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండలో బయటకు వెళ్తే గొడుగు, టోపీ వంటివి ఉపయోగించాలి. ఆల్కహాల్, టీ, కాఫీ తాగకపోవడం మంచిది.

సంబంధిత పోస్ట్