స్మార్ట్ టెక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌.. లుక్ అదిరింది

75చూసినవారు
స్మార్ట్ టెక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌.. లుక్ అదిరింది
థాయిలాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్మార్ట్ టెక్ 45వ బ్యాంకాక్ మోటార్ షోలో కొత్త ఎలక్ట్రిక్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఫెలో టూజ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ క్రూయిజర్‌కు సంబంధించిన మైలేజ్ అతి పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి ఒకసారి చార్జ్ చేస్తే 720 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తోంది. ఫెలోటూజ్ వెహికల్ టు లోడ్ లేదా వీ2ఎల్ ఫీచర్‌‌తో ఆకట్టుకుంటుంది. కేవలం 20 ని. వ్యవధిలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్