హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మరో కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కార్తీక్ దండు డైరెక్షన్‌లో మార్చి నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ స్క్రీన్‌ప్లేపై సుకుమార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.