వాహనాల పైనుంచి దూసుకెళ్లిన విమానం.. చివరికి (VIDEO)

52చూసినవారు
అమెరికాలోని టెక్సాస్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్విన్ ఇంజన్ ప్రొపెల్లర్ విమానం విక్టోరియాలోని స్టేట్ హైవేపై చాలా తక్కువ ఎత్తులో ఎగిరింది. ఈ నేపథ్యంలో రహదారిపై వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టి క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో ఆ విమానం రెండు ముక్కలైంది. దీంతో విమానం శిథిలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. పైలట్‌తోపాటు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలయ్యింది.

సంబంధిత పోస్ట్