నేనిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా: హైపర్ ఆది (వీడియో)

57చూసినవారు
ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని హైపర్ ఆది అన్నారు. తాను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు.. ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరికి పవన్ అలా వెళ్లారన్నారు.

సంబంధిత పోస్ట్