ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఓ మహిళ బస్సు నుంచి జారి కిందపడింది. ఈ ఘటన కొమరం భీమ్ జిల్లాలో జరిగింది. వాంకిడి మండలం ఖమాన బస్ స్టాప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు వచ్చి ఆగింది. దీంతో బాధిత మహిళ బస్ స్టాప్ రావడంతో దిగేందుకు సిద్దమైంది. ఫుట్ బోర్డు నుంచి దిగుతున్న క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా బస్సు ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆమె రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తు బస్సు టైరుకు దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.