రెండు వేర్వేరు కేసుల్లో మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి. ఇంట్లో ఉన్న బాలికపై.. సంవత్సరాల తరబడి అత్యాచారానికి పాల్పడిన సవతి తండ్రికి కేరళ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అతనికి ఏకంగా 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే మరో వైపు మహారాష్ట్రలో బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ముగ్గురు వ్యక్తులకు పోక్సో కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.