తెలంగాణలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. వచ్చే నెల 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు ఉంటాయని వెల్లడించారు. ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందని నాగరత్న చెప్పారు.