దేశంలో జులైలో తగ్గిన నిరుద్యోగ రేటు

68చూసినవారు
దేశంలో జులైలో తగ్గిన నిరుద్యోగ రేటు
దేశంలో జులై నెలలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. సీఎంఐఈ కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే ప్రకారం, జూన్‌లో 9.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జులైలో 7.9 శాతానికి పడిపోయింది. మొత్తం నిరుద్యోగుల సంఖ్య జులైలో 4.14 కోట్ల నుంచి 3.54 కోట్లకు తగ్గింది. అదే నెలలో గ్రామీణ ప్రాంతంలో 7.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8.5 శాతంగా నిరుద్యోగ రేటు ఉంది. నెల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో 0.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 1.8 శాతం నిరుద్యోగ రేటు తగ్గింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్