హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు (వీడియో)

73చూసినవారు
TG: హైదరాబాద్‌లో పేలుడు సంభవించింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్టోర్ రూమ్ వెనుకాల శుక్రవారం ఉదయం GMR ఉద్యోగి క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో GMR ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన పోలీసులు వెంటనే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, పేలుడు జరిగిన గదిలో సిలిండర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పేలుడు ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్