గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ గణనీయంగా పెరిగి 'అట్మాస్ఫియరిక్ రివర్స్' అనే భారీ నీటి ఆవిరి పాయలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటినే ఆకాశ నదులు(ఫ్లయింగ్ రివర్స్) అంటారు. మహాసముద్రాల్లో వేడెక్కినా నీరు భారీ మొత్తంలో ఆవిరిగా మారి, ఆకాశంలో కంటికి కనిపించని నీటి ఆవిరి పాయలుగా ఏర్పడుతాయి. నేచర్ జర్నల్ 2023 ప్రకారం 1951-2020 మధ్య భారత్‌లో 574 ఆకాశ నదులు ఏర్పడ్డి, 80% వరదలకు కారణమయ్యాయి.