12 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం, బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. 'వేతన జీవుల ఖాతాల్లో ఇక కోతలు, వాతలు కాదు. వారి బంగారు భవితకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయి. ఇది కేవలం పద్దు కాదు ప్రతి భారతీయ కుటుంబంలో సంతోషాల పొద్దు. మధ్య తరగతి కుటుంబాల్లో చిరునవ్వులు వేతన జీవుల ముఖాల్లో సంతోషపు వెలుగులు అందించిన ప్రధాని మోదీకి భారతీయులందరి తరఫున నా కృతజ్ఞతలు' అని Xలో రాసుకొచ్చారు.