పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే!

75చూసినవారు
పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే!
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కు ఏ శాఖలు ఇస్తారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ ఉత్కంఠకు తెరవీడినట్లు తెలుస్తోంది. పవన్‌ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. నాదెండ్ల మనోహర్‌కు సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్