మోదీ ప్రమాణస్వీకారానికి రానున్న దేశాధినేతలు వీరే!

72చూసినవారు
మోదీ ప్రమాణస్వీకారానికి రానున్న దేశాధినేతలు వీరే!
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు డా.మహమ్మద్ మొయిజ్జు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సైతం రానున్నారు.

సంబంధిత పోస్ట్