భారతదేశంలోని మహిళలు సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉన్నారు. భారత్‌కు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా మహిళలు సమాజంలో బ్రతకడానికి నిత్యం పోరాడాల్సి వస్తోంది. కనీసం మహిళలకు సొంత ఇంట్లో కూడా స్వేచ్చ, సమానత్వం, రక్షణ లేకుండా పోయింది. సొంతవారే దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలు సొంత వారి చేతిలోనే ఎక్కువగా భాదింపబడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇది ఆందోళనకు గురిచేస్తోంది.