రాత్రిపూట 5 గంటలు, అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే, రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువనిఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల గుండె జబ్బులు రావడం, ఆయుష్షు తగ్గడం జరగొచ్చు. క్రమరహిత నిద్ర కారణంగా, చాలా మంది బరువు తగ్గడం, కండరాల నొప్పులు, అవయవాలలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల '5 గంటల నిద్ర'ను పక్కకు నెట్టి, రాత్రిపూట 7-8గంటలపాటు అందరూ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.