రైలులో సిగరెట్‌ తాగిన యువకులతో గుంజీలు తీయించారు(వీడియో)

77చూసినవారు
సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ నడిచే రైలులో సిగరెట్‌ తాగితే రైలు ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ కొందరు రైలులో సిగరెట్‌ తాగుతూ నిబంధనలు అతిక్రమిస్తుంటారు. తాజాగా వైరలవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు ట్రైన్ డోర్ లో నిల్చొని సిగరెట్ తాగుతున్నారు. అది గమనించిన తోటి ప్రయాణికులు వారిని హెచ్చరించారు. అనంతరం వారితో గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్