డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పుడేమైంది: కేసీఆర్

57చూసినవారు
డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పుడేమైంది: కేసీఆర్
డిసెంబర్ 9 నాడే రేవంత్ రుణమాఫీ చేస్తామని ఆనాడు అన్నారు.. మరి ఇప్పుడు ఎందుకు రుణమాఫీ చేయట్లేదని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 'ఇవాళ్టికి రైతుబంధు వేయలే. ప్రభుత్వం మెడలు వంచాలంటే.. మీ ఓటుతో బుద్ది చెప్పాలి. పదేళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు మితిమీరిన పనులు చేశామా? పోలీసులు పార్టీ బోర్డులను తొలగిస్తున్నారు. ఇదా మీరు చేసే పనా. మీ పనులను ప్రజలు గమనిస్తున్నారు. మేము అధికారంలోని వస్తే మీ పరిస్తితేందో ఆలోచించుకోవాలి' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్