సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు

52చూసినవారు
సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు
ఓ చిన్న పొరబాటు కారణంగా ఒక జంటకు అనుకోకుండా విడాకులు మంజూరైన ఘటన యూకేలో జరిగింది. విలియమ్స్‌ అనే మహిళ తన భర్తతో విడాకులు ఇప్పించాలని ఓ సంస్థను ఆశ్రయించింది. దంపతుల మధ్య సంప్రదింపుల దశలో ఉండగానే.. మరో క్లయింట్‌ తుది విడాకుల కోసం రూపొందించిన పత్రాల్లో పొరబాటున విలియమ్స్‌ దంపతుల పేరును చేర్చారు. ఈ పత్రాలను అలాగే కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేవలం 21 నిమిషాల వ్యవధిలోనే విడాకులు మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్