ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తున్న అత్యంత పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ కోల్డ్ ప్లే. తాజాగా దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌లో లైవ్ కన్సర్ట్స్‌కి ఎకానమీ వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ముంబై, అహ్మదాబాద్‌లో Coldplay Concertsకి వచ్చిన విశేష స్పందనే దీనికి నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలు కన్సర్ట్ ఎకనామీ రంగాన్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలన్నారు.